రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో కీలకమని డిసిసి కార్యదర్శి పెంటయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ నుండి సుమన్ గుర్తి గేటు సమీపంలో గత రెండు నెలల నుండి 18 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాకంచెర్ల గ్రామ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే163 పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించి గతంలో పలువురు ప్రాణాలను కోల్పోయారు. ఆ విషయాన్ని డిసిసి కార్యదర్శి పెంటయ్య స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దగ్గరుండి రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డీసీసీ కార్యదర్శి పెంటయ్య స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డ్రైవింగ్ చేసేవారు ఒక్క నిమిషం ఆలోచించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని నెమ్మదిగా గమ్యం చేరుకోవాలని సూచించారు. అతివేగము ప్రమాదకరమని,రోడ్డు భద్రత నియమ నిబంధనలు వాహనదారులు పాటించాలని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
