ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident

Seven-storey building fire in Jakarta, Indonesia Firefighters working to control a massive fire at a seven-storey building in Jakarta.

Jakarta Indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఏరియల్ సర్వే కోసం డ్రోన్ల తయారీ మరియు పరిశోధన కార్యకలాపాలు నిర్వహించే ఏడంతస్తుల కార్యాలయ భవనంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

ఘటన సమయంలో భవనంలో పనిచేస్తున్న పలువురు బయటకు రాలేకపోవడంతో ఘటన తీవ్రత పెరిగింది.ఇప్పటి వరకు “20 మంది ప్రాణాలు కోల్పోగా“, మరికొందరు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ:Telangana Rising Global Summit: రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పెట్టుబడుల వరద…పలు కంపెనీలతో ఎంఓయూలు

మంటలు వేగంగా పై అంతస్తులకు చేరడంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడ్డాయి.సమీప భవనాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, అధికారులు స్థానిక ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, భవనంలోని మొదటి అంతస్తులో గోదాంలో నిల్వ ఉంచిన బ్యాటరీ పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *