India-US Trade Deal 2025: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) చర్చలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ రౌండ్‌లో మొదటి విడత ఒప్పందంపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశాలు దిల్లీలో జరుగనున్నారు.
ALSO READ:పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్ కుమార్
అమెరికా బృందం నాయకత్వం
అమెరికా తరఫున “డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్” నేతృత్వం వహిస్తారు. భారత్ ఎగుమతులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో, ఈ సమస్య ప్రధాన చర్చ అంశంగా ఉంటుంది.
మునుపటి చర్చల నేపథ్యం
ఇది రెండో విడత చర్చ. సెప్టెంబర్ 16న అమెరికా ప్రతినిధులు భారత్‌ను సందర్శించి, సెప్టెంబర్ 22న వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బృందం అమెరికాకు వెళ్లారు.
భవిష్యత్తు దిశానిర్దేశం
వాణిజ్య శాఖ కార్యదర్శి “రాజేష్ అగర్వాల్” ప్రకారం, 2025 డిసెంబర్ నాటికి అన్ని వాణిజ్య చర్చలను పూర్తి చేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇప్పటివరకు మొత్తం ఆరు విడతల చర్చలు జరగగా, ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి ఈ పరిమాణాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఉద్దేశ్యం ఉంది.
