రాజా ఫ‌ర్నీచ‌ర్ మూడో షోరూమ్ ప్రారంభోత్సవం

Minister Dr. Ponguru Narayana inaugurated the third showroom of Raja Furniture in Nellore, praising its services over the past 25 years. Minister Dr. Ponguru Narayana inaugurated the third showroom of Raja Furniture in Nellore, praising its services over the past 25 years.
  • ప్ర‌జ‌ల టేస్ట్ త‌గ్గ‌ట్టుగా ఫ‌ర్నీచ‌ర్ ఏర్పాటు
  • భ‌విష్య‌త్‌లో మ‌రెన్నో నూత‌న బ్రాంచ్‌ల‌ను ప్రారంభించాలి
  • రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
  • నెల్లూరు న‌ర్త‌కి సెంట‌ర్‌లో రాజాఫ‌ర్నీచ‌ర్ మూడో షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి
  • మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు

గ‌త 25 ఏళ్లుగా నెల్లూరు జిల్లా ప్ర‌జానికి ఫ‌ర్నీచ‌ర్ రంగంలో రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు మంచి సేవ‌లు అందిస్తూ…అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కొనియాడారు. నెల్లూరు న‌గ‌రం న‌ర్త‌కి సెంట‌ర్‌లో…రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు రాజా మ‌ల్లికార్జున‌రావు, రాజ‌శేఖ‌ర్‌, రాజా శ్రీ‌నివాస‌రావు, రాజా హ‌జ‌ర‌త్‌బాబులు…మూడో షోరూమ్‌ను నూత‌నంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వానికి రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రిబ్బ‌న్ క‌ట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయ‌ణ‌కి…షోరూమ్ నిర్వాహ‌కులు పూల‌బొకేల‌తో స్వాగ‌తం ప‌లికి…శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

నెల్లూరు న‌ర్త‌కి సెంట‌ర్లో రాజా ఫ‌ర్నీచ‌ర్ ను మూడో షోరూమ్ ను ఓపెన్ చేశ‌రాన్నారు. గ‌త 25 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నార‌న్నారు. రాజా మ‌ల్లికార్జున‌రావు, రాజ‌శేఖ‌ర్‌, రాజా శ్రీ‌నివాస‌రావు, రాజా హ‌జ‌ర‌త్‌బాబులు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తూ…నెల్లూరు ప్ర‌జ‌ల‌కి అందుబాటులో ఉంటూ మంచి సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. రోజు రోజుకి అన్నీ రంగాల్లోనూ మార్పులు వ‌స్తున్నాయ‌న్నారు. అదే విధంగా గ‌త 25 ఏళ్ల‌లో ఫ‌ర్నీచ‌ర్ రంగంలోనూ అనేక మార్పులు జ‌రిగాయ‌న్నారు. ప్ర‌జ‌ల‌కి అనుగుణంగానే…ఫ‌ర్నీచ‌ర్‌ను తీసుకు వ‌చ్చి అంద‌చేయ‌డం వ‌ల్లే…త‌మ వ్యాపారం అభివృద్ధి చెందుతుంద‌ని రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు తెలిపార‌న్నారు. జీ ప్ల‌స్ 5 మొత్తం ఆరు ఫ్లోర్‌ల‌లోనూ అనేక ర‌కాల అత్యాధునిక ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కి అందుబాటులో ఉంచార‌న్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డ పోర్ట్ ఉంటే ఆ సిటీ బాగా డెవ‌ల‌ప్ అవుతుంద‌న్నారు. ముంబాయి, కోల్‌క‌త్తా, చెన్నై, కొచ్చిన్ ల‌లో పోర్ట్ లు ఉండ‌డం వ‌ల్లే ఆ కంట్రీల‌న్నీ ఎంతో అభివృద్ది చెందాయ‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో మ‌న నెల్లూరులో కూడా కృష్ణ‌ప‌ట్నం పోర్ట్ ఉంద‌ని…త్వ‌ర‌లోనే నెల్లూరు కూడా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. నెల్లూరులో రాజా ఫ‌ర్నీచ‌ర్ షోరూమ్‌లు మ‌రెన్నో ఓపెన్ చేయాల‌ని…వారి బిజినెస్ మ‌రింత అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌న్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే నెల్లూరు సిటీని ఎంతో అభివృద్ధి చేశామ‌ని గుర్తు చేశారు. అయితే 2019లో వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆరోపించారు. ముఖ్యంగా దోమ‌లు లేని నెల్లూరు న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకే అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్ట‌మ్‌ని తీసుకువ‌చ్చాన‌న్నారు. అలాగే న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికి స్వ‌చ్ఛ‌మైన నీటిని అందించాల‌న్న ఉద్దేశంతోనే డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తి చేశామ‌న్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల ప‌నులు పూర్తి చేయాలంటే రూ. 200 కోట్లు అవ‌స‌రం ఉంటుంద‌ని… వాటిని త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల్ని ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే ఆ కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు కూడా రిలీజ్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌స్తుతానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అని…అయినా కూడా రాష్ట్రాభివృద్ధిని చేసేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అనుభ‌వంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నారు. నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నింటిని ఖ‌చ్చితంగా పూర్తి చేసి తీరుతాన‌ని…అందుకు కొంచెం టైం కావాల్సి ఉంటుంద‌ని నారాయ‌ణ ప్ర‌జ‌ల్ని రిక్వెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *