భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో, ఈ నెల 12న విజయదశమి పండుగ రోజున,, అశ్వారావుపేటలోని పామాయిల్ కర్మాగారం నందు నూతనంగా నిర్మించిన 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు..ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగ రోజున విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని, తెలంగాణ పామాయిల్ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దశలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రైతులకు లాభం చేకూర్చే లాగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.. అలానే ఈ నెల 12న విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవంతో పాటు, రైతులకు పంట అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని పామాయిల్ రైతులు అంతా విచ్చేయునున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు.
విజయదశమి పండుగ రోజున విద్యుత్ కేంద్రం ప్రారంభం
