హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీని(Hyderabad Biryani) ప్రపంచ వ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశానని ఆయన పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల ప్రజలు పాతబస్తీలో షాపింగ్ చేయడానికి ముత్యాల వాణిజ్యాన్ని కూడా నేనే ప్రోత్సహించానని చెప్పారు.
తన పాలనలో హైదరాబాదులో ముస్లింలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులయ్యారని గర్వంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా తన దూరదృష్టితోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు.
also read:Andhra Pradesh Heavy Rain Alert | ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన..
చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను హాస్యాత్మకంగా తీసుకోగా, మరికొందరు వాటిలోని రాజకీయ ఉద్దేశ్యాలను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్రను చాటుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
