భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన అల్లుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.రక్తస్రావం లో ఉన్న అల్లుడిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందకుండా అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించి వైద్య సిబ్బందికి చెమటలు పట్టించాడు.బంధువులు,హాస్పటల్ సిబ్బంది అతి కష్టంపై పట్టుకుని చికిత్స అందించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఇమ్రాన్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఏడాదికితం ఇమ్రాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత భార్య నందినిను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటంతో ఇటీవల భార్య నందిని బేతపల్లి లోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది.ఆమెను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి బేతుపల్లి వెళ్లిన ఇమ్రాన్ అక్కడే గొడవపడి బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తీవ్ర రక్తస్రావం లో ఉన్న అల్లుడిని హుటాహుటిన సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే ఇమ్రాన్ ఆస్పత్రి నుండి చికిత్స పొందకుండా బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.అతి కష్టంపై బంధువులు,హాస్పటల్ సిబ్బంది ఇమ్రాన్ ను పట్టుకొని చికిత్స అందించారు.ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.అయితే గతంలో కూడా ఇమ్రాన్ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు