నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో వారం ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న HP గ్యాస్ ఏజెంట్ సిలెండర్ లో గ్యాస్ గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు అప్ప జెప్పారు..
Hp గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.
కానీ వంట గ్యాస్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగుతిన్న వినియోగదారుడు..
గ్యాస్ బండిని ఆపి అందులోని మిగతా సిలిండలను తూకం వేయగా వాటిలో కూడా 5 నుండి 2 కిలోల చొప్పున తక్కువ రావడంతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాకం పై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వినియోగదారులు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని తూకం వేసిన అధికారులు గ్యాస్ 4 తక్కువ రావడంతో గ్యాస్ సిలిండర్ బండిని పోలీస్ స్టేషన్ కు తరలించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత డిస్టిక్ లీగల్ మెట్రోలాజీ అధికారులకు నివేదిక పంపన అధికారులు..
63 సిలిండర్ లో ఒక్కో సిలిండర్ లో దాదాపుగా 2కిలోల నుండి 5 కేజీ లు గ్యాస్ తక్కువ రావడం తో సంబంధిత గ్యాస్ ఏజెన్సి పై లీగల్ గా తగు చర్యలు తీసుకుంటామని డిస్టిక్ లీగల్ మెట్రోలాజి ఆఫీసర్ భూలక్ష్మి తెలిపారు.