జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కేంద్రంలో బీచుపల్లి గ్రామపంచాయతీలో యాక్తాపురం గ్రామంలో అర్జున్(ఆదాం) బిసమ్మ దంపతులకు సామాన్య కుటుంబంలో జన్మించి నూతనంగా వెలువడిన టీచర్ జాబుల నియమాంకల్లో స్కూల్ అసిస్టెంట్ ,బయోసైన్స్ లో ప్రతిభ కనబరిచి న సంధ్యారాణిని నేడు బీచుపల్లి గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు ,బీసీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో శాల్వాల గజమాలవేసి ఘనంగా కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది జరిగింది.
ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి బీచుపల్లి రఘు చౌదరి రామాంజనేయులు రాజశేఖర్ గౌడ్ వీరారెడ్డి, లక్ష్మిరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, జ్యోతి రాజు, రవి బాబు, సతీష్ ,జ్యోతి తదితరులు పాల్గొనడం జరిగింది ఏ వస్ టివి రిపోర్టర్ రామాంజనేయులుతో జాబు యొక్క ఆనందం ఎలా పంచుకుంటున్నారు అని వివరణ కోరగా
అతి సామాన్య కుటుంబం చాలా పెద్ద కుటుంబం మాది కానీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము ప్రభుత్వ గురుకులాలలో అభ్యసించి వారి యొక్క కుటుంబ సభ్యులను వారి యొక్క జీవనశైలిని చవిచూసిన సంధ్యారాణి దృడ సంకల్పంతో యువతకు ఆదర్శంగా ఉండి తల్లిదండ్రుల యొక్క కలలను సహకారం చేయాలని కుటుంబానికి తన వంతు చేదోడు వాదోడుగా ఉండాలని తన పుట్టిన గ్రామానికి చదువుకున్న విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకురావాలన్న ఆశయాలతో కష్టపడి చదివి తన కుటుంబ సహకారాలతో వారి అన్నదమ్ముల యొక్క ప్రోత్సాహం ఉండి ఆడపిల్ల అని కూడా చూడకుండా మగ పిల్లలతో సమానంగా చదివించి అన్ని విషయాలలో మా తల్లిదండ్రులు సహకారం అందించారు చెప్పడం జరిగింది.
సామాన్య కుటుంబంలో కష్టపడిన సంధ్యారాణి ఘనసన్మానం
