H-1B VISA : H-1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వలనే భారత్‌లో వీసా ప్రాసెస్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ విధానం ప్రభావంతో దేశవ్యాప్తంగా H-1B వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా స్పందించింది. ఇప్పటికే మీకు ఈమెయిల్ ద్వారా షెడ్యూల్ అపాయింట్మెంట్ వచ్చి ఉంటే, కొత్తగా ఇచ్చిన తేదీకి మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేసింది. పాత తేదీకి వచ్చినవారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని తెలిపింది.
ALSO READ:Gold Rates Today | బంగారం ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం ధరలు
ఇటీవలి నెలల్లో వలస విధానాలపై అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి చూపుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలు రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణ తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఒకే దిశగా కఠిన నియంత్రణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. “Make America Safe Again” క్యాప్షన్‌తో ట్రంప్‌ను చూపించే ఫొటోను అప్లోడ్ చేయడం చర్చనీయాంశమైంది.
