H-1B Visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం 

Donald Trump announces new H-1B visa policy focusing on American workforce training U.S. President Donald Trump’s administration introduces new H-1B visa strategy to empower American workers.

అమెరికాలో H-1B Visa విధానంపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక సంచలన తీసుకుంది. ఇకపై విదేశీ నిపుణులు అమెరికాలో దీర్ఘకాలికంగా పనిచేయడం కాదు, స్థానిక అమెరికన్ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ వీసాలు ఇవ్వనున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.

వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, ఇప్పుడు తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు “నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్”(Knowledge Transfer) రూపంలో ఈ కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

గత 30 ఏళ్లుగా తయారీ ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు సెమీకండక్టర్, నౌకా పరిశ్రమలను తిరిగి అమెరికాకు తీసుకురావడం ప్రధాన లక్ష్యం” అని బెస్సెంట్ పేర్కొన్నారు.

ALSO READ:Kurnool Ips Officer:జైషే మొహ్మద్ కుట్రను భగ్నం చేసిన తెలుగు IPS అధికారి


ట్రంప్(Trump) దృష్టి ప్రకారం, విదేశీ నిపుణులు 3 నుండి 7 సంవత్సరాల కాలం అమెరికాలో ఉండి స్థానికులకు శిక్షణ ఇచ్చి స్వదేశాలకు వెళ్ళిపోవాలి. “ఇది ఉద్యోగాలు దొరకడం కాకుండా, కొత్త నైపుణ్యాలు సృష్టించే ప్రక్రియ” అని ఆయన అన్నారు.

అదే సమయంలో, లక్ష డాలర్లలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు 2,000 డాలర్ల టారిఫ్ రిబేట్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని కూడా ఆయన తెలిపారు.

వాణిజ్య విధానాల ఫలాలు అమెరికా కుటుంబాలకు చేరేలా ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ విధానం ద్వారా అమెరికన్ తయారీ రంగం తిరిగి బలపడతుందని, విదేశీ ఆధారాన్ని తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *