ఎలమంచి నియోజక వర్గం రాంబిల్లి మండలంలో వెంకటాపురం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ… అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్ లో బ్రాండిక్స్ దగ్గరలో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చొరవతో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్,ఎంపీ సీఎం రమేష్,మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తదితర కూటమి నాయకులు హాజరవుతున్నారని కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ధూళి రంగ నాయకులు రామదాసు,శ్రీనివాసరావు, చిన్నారావు, దినబాబు , బాబ్జి , అప్పల నూకన్న దొర తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
రాంబిల్లిలో ఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ పర్వం
