శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగింది. ఊరంతా పండగ శోభను సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, విచిత్ర వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో పట్టణం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాలనుంచి పట్టణానికి భక్తుల రాక మొదలయ్యింది. పట్టణ ప్రధాన రహదారులు భక్తులతో నిండిపోయాయి.
మాన్సాస్ ఛైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ అధికారులు, పూజారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరాలు వైభవంగా ముగిసాయి
