Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరాలు వైభవంగా ముగిసాయి

శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరాలు వైభవంగా ముగిసాయి

-

Chat on WhatsApp

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తొలేళ్ల సంబ‌రం సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఊరంతా పండ‌గ శోభ‌ను సంత‌రించుకుంది. పులివేషాలు, క‌ర్ర‌సాము, క‌త్తిసాము, విచిత్ర వేషాలతో ప‌ట్ట‌ణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో ప‌ట్ట‌ణం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల‌నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తుల రాక మొద‌ల‌య్యింది. ప‌ట్ట‌ణ ప్ర‌ధాన ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోయాయి.
మాన్సాస్ ఛైర్మ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, ఎంఎల్ఏ అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. వారికి ఆల‌య అధికారులు, పూజారులు అధికార లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఎంపి క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు స‌తీస‌మేతంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp