గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణ వేణి చౌక్ వద్ద శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ కలిసి మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా పూలే బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. అణచివేతలో ఉన్నవారికి అద్దం పట్టిన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ఆయన చేసిన సేవలు యుగయుగాలకీ నిలిచిపోయేలా ఉన్నాయని గుర్తుచేశారు.
పూలే ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని, అదే మహాత్ముడి ఆశయాలకు న్యాయం చేయడమని అన్నారు. సమాజంలో సమానత్వం నెలకొనేలా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీల కార్యకర్తలు, యువజన సభ్యులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడినట్టు నిర్వాహకులు తెలిపారు.