పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోవులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు భోగీలు పట్టాలపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైలు గూడ్స్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ కన్నాల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పి భోగిలు పట్టాల పై పడిపోవడంతో పలు రైళ్ల రద్దు, హైదరాబాద్, చెన్నై, మద్రాస్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుండి ఢిల్లీ వైపు వెళ్ళవలసిన పలు రైళ్లను పెద్దపల్లి నుండి నిజామాబాద్ వైపుగా మళ్లింపు.
పెద్దపల్లి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
