కాజీపేట రైల్వే స్టేషన్‌లో రహస్యంగా దాచిన గంజాయి బ్యాగ్‌ను పోలీస్ జాగిలం గుర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయి తరలింపు జరుగుతుందనే సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం అక్కడ తనిఖీలు చేపట్టింది.
స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఫ్లాట్‌ఫాం 1 చివర వరంగల్ వైపున ఉన్న ప్రయాణికుల బెంచ్ వద్ద రహస్యంగా దాచిన బ్యాగ్‌ను గుర్తించారు. పోలీస్ జాగిలం నిర్దేశించిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో నాలుగు కిలోల గంజాయి బయటపడింది.
గంజాయి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా గంజాయి యజమాని కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటన డ్రగ్స్ అక్రమ రవాణా పై మరింత నిఘా అవసరమని అధికారులు పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ఇన్స్‌పెక్టర్ సురేష్, ఆర్.ఐ శివకేశవులు, ఆర్.ఎస్.ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజుతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట స్టేషన్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.