రామగుండం పట్టణంలోని పెద్ద చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారితో పాటు టీజీఎఫ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయికుమార్ గారు విశిష్ట అతిథిగా హాజరై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చెరువులో చేప పిల్లల్ని వదులుతూ ప్రారంభించడం జరిగినది.
టీజిఎఫ్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మాట్లాడుతూ…..
జనంలో ఒక్కడిగా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు రామగుండం ప్రజల ఆశీర్వాద బలంతో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారని తప్పకుండా రామగుండం నియోజకవర్గం లో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నింటికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియతమ నాయకులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మాట్లాడడం జరిగినది.
గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ….
రామగుండం నియోజకవర్గ పరిధిలో చుట్టూరా చెరువులతోపాటు రిజర్వాయర్లు కూడా నెలకొని ఉన్నాయని నియోజకవర్గంలో చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్న మత్స్యకార కుటుంబాలన్నింటికీ లబ్ధి చేకూరే విధంగా వారికి ఉచిత చేప పిల్లల పంపిన దగ్గర నుంచి ఎక్స్గ్రేషియా వరకు సబ్సిల మీద లోన్ల విషయంలో గాని ట్రాన్స్పోర్ట్ విషయం గానీ అన్ని విధాలుగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదలకు ఫిషరీస్ చైర్మన్ గా మీరు రామగుండం నియోజకవర్గ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నానని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మత్స్య విభాగం అధికారులు డిడి కధీర్ డిఎఫ్ఓ భాస్కర్,ఫీల్డ్ ఆఫీసర్లు, రవి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్పొరేటర్లు ఆయా విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య ఉపాధ్యక్షులు సారయ్య డైరెక్టర్లు సుజాత శ్రీకాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామగుండంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
