బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయారు. అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’ వంటి చిత్రాలలో నటించి తన పాత్రలకు మంచి ప్రశంసలు అందుకున్నారు.
తన కెరీర్ ప్రారంభంలో ఫాతిమా సనా షేక్ కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా, తనకు ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పి, “ఒక చిత్రానికి ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ ఒక దర్శకుడు నన్ను అడిగాడు, ‘మీరు ఏం చేయడానికి రెడీనా?’ అని. ఆ సమయంలో నాకు అతని ఉద్దేశం అర్థమయ్యింది, కానీ నేను అతనికి చెప్పా, ‘నేను కష్టపడి పనిచేస్తాను, నా పాత్ర కోసం ఏమి కావాలో అది చేస్తాను.'” అని ఫాతిమా చెప్పారు.
ఫాతిమా తన అనుభవాలను పంచుకుంటూ, “అతను తిరిగి అదే ప్రశ్న అడిగినప్పుడు, నాకు అర్థమయ్యింది. కానీ, నేను ఏమీ చేయకుండా అతనికి ఎదురుచూడాలని నిర్ణయించుకున్నాను.” అని చెప్పారు. సౌత్ ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన తెరిచింది. “హైదరాబాద్‌లో వచ్చినప్పుడు, నేను ఓ నిర్మాతతో కలుసుకున్నప్పుడు, వారు సులభంగా ఈ విషయం గురించి మాట్లాడతారు. ‘మీరు కొంతమందితో కలవాల్సి ఉంటుంది’ అని కొందరు చెప్పుతారు. వారి ఉద్దేశం సూటిగా చెప్పకపోయినా, ఆ విషయం అర్థమైపోతుంది” అని ఫాతిమా పేర్కొన్నారు.
ఫాతిమా సనా షేక్ తన బాలీవుడ్ కెరీరును ‘దంగల్’తో మొదలుపెట్టారు. ‘చాచీ 420’ చిత్రంలో చిన్న వయసులోనూ నటించారు. ఈ లిస్టులో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’, ‘అజీబ్ దాస్తాన్స్’, ‘థార్’, ‘సామ్ బహదూర్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఆమె కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.