రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగ్ మండలం జప్తి సునూర్ గ్రామంలో మడూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని క్వింటాల్కు ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, విక్రయించిన ధాన్యానికి 48 గంటలలోనే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సీఈఓ కృష్ణతో పాటు జప్తి సునూర్ మాజీ సర్పంచ్ అంజయ్య మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని సూచన
