అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో, మస్క్ వైట్‌హౌస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ గొడవల తర్వాత తొలిసారిగా ఎలాన్ మస్క్ వైట్‌హౌస్(Elon Musk White House)లో అడుగుపెట్టడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
విభేదాల కారణంగా వైట్‌హౌస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఈసారి ప్రత్యేక విందుకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత అమెరికా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో, ట్రంప్(Trump) ఆయన గౌరవార్థం వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
ALSO READ:Hidma Associate Arrested: కోనసీమ రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా అరెస్ట్
ఈ విందుకు గ్లోబల్ లీడర్లు, పరిశ్రమ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలను ఆహ్వానించారు. ఇవాళ్టి ఈవెంట్‌లో మస్క్ హాజరుకావడం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రభుత్వ విధానాలపై విభేదాల కారణంగా ట్రంప్ సలహా మండలి నుంచి తప్పుకున్న మస్క్, ఇప్పుడు మళ్లీ వైట్‌హౌస్ వేదికపై ప్రత్యక్షం కావడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మస్క్‌తో పాటు ఫుట్‌బాల్ తార క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo), ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి ప్రపంచ ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. దీంతో ట్రంప్–మస్క్ మధ్య సంబంధాల్లో మళ్లీ మెరుగుదల కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
