ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఈ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరువులో శవమై తేలినట్లు గుర్తించారు. మృతులుగా పంతంగి కృష్ణ (60), సీతా (55) పేర్లు స్థానికులు పేర్కొన్నారు.
ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్ళే రైతులు గ్రామ శివారులోని రావి చెరువులో రెండు మృతదేహాలను కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయం తో మృతదేహాలను బయటికి తీశారు.
కృష్ణ ఆటో నడిపించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల ఆటో మరమ్మత్తులకు గురవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక, భర్త, భార్య చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానిస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దంపతులు రోడ్డుపై నడుస్తున్న దృశ్యం ఓ షాపు వద్ద ఉన్న సీసీ టివి లో నమోదు అయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల అనుమానం వలన ఈ ఘటనకు ఆర్థిక సమస్యలు కారణమని చెబుతున్నారు.