ICC Men’s T20 World Cup 2026 లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా జట్టుకు ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. యూఎస్‌ఏ క్రికెట్ టీమ్‌ను ఉత్సాహపరిచేలా అమెరికా అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” ప్రత్యేక సందేశం పంపారు.
‘‘భారతదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. యూఎస్‌ఏ జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మన జట్టు బలమైనది. మీరు విజయం సాధించాలని అమెరికా మొత్తం కోరుకుంటోంది’’ అంటూ ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.
ICC Men’s T20 World Cup 2026 లో భాగంగా శనివారం రాత్రి ముంబయి వేదికగా భారత్, యూఎస్‌ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించి టోర్నీని శుభారంభం చేసింది. చివరి వరకు పోరాడిన అమెరికా జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది.
మ్యాచ్ అనంతరం ట్రంప్ నుంచి ఈ మెసేజ్ రావడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ పోస్టుకు భారత్‌లోని అమెరికా రాయబారి “సెర్గియో గోర్” స్పందిస్తూ, “మీ మద్దతుకు ధన్యవాదాలు “ అని రిప్లై ఇచ్చారు. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఈ స్పందన యూఎస్‌ఏ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహంగా మారింది.
T20 World Cup 2026 | ఓటమి తర్వాత USA Teamకు ట్రంప్ సంచలన మెసేజ్
Donald Trump sends message supporting USA cricket team after India vs USA T20 World Cup match
