తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున మొత్తం రూ. 15,01,740/- లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కదోవపట్టించడానికే కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మీ చెక్కుతో పాటు తులం బంగారం అడుగుతున్నారని ప్రజల తరపున మళ్ళీ కోరుతున్నామన్నారు. అనంతరం మండల కేంద్రంలో గల దుర్గామాతను నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలమడుగులో చెక్కుల పంపిణీ కార్యక్రమం
