తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాలైన BC, SC, ST, మరియు EBC ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ ప్రత్యేకంగా తమ డిమాండ్లను ప్రాధాన్యంగా ఉంచింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, మండల కేంద్రాల్లో MROల కు వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ దీక్షల సందర్భంగా జిల్లా కన్వీనర్ భులోనేశ్వర్ తమ డిమాండ్లను వివరించారు.
ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నది ధర్మ సమాజ్ పార్టీ ప్రధాన డిమాండ్. ప్రతి గ్రామంలో ఆధునిక స్కూల్ నిర్మించడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు. అలాగే, ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలను అందించాలనీ, ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి అంశంలో, అర్హులైన ప్రతి ఒక్కరికి వారి నైపుణ్యాలకు తగిన ఉపాధిని అందించి గౌరవప్రదమైన జీవనానికి అవకాశం కల్పించాలని చెప్పారు. అంతేకాకుండా, అర్హులైన వారికి సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని అందించాలనీ, 200 గజాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, జిల్లా నాయకులు రాజు, గంగరాజు, భూపాల్, శేఖర్, నవీన్, లింగం, శివరామకృష్ణ, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ ఈ డిమాండ్ల సాధనకు అంకితభావంతో పని చేస్తుందని హామీ ఇస్తోంది.