- ఆకుకూరలు, కాయగూరలు, చిరు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత
- దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక
- దేశీయ వరి విత్తనాలు సేకరణ
- డాక్టర్ శశిప్రభ స్టేన్లీ, సిఇఒ, సిఫా
ప్రకృతి ఆధారంగా దేశీయ విత్తన గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని సిఫా సిఇఒ డాక్టర్ శశిప్రభ స్టేన్లీ పేర్కొన్నారు. చింతపల్లి మండలం లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ, బాపట్ల మిర్చి, నాటు టమాటా, బంతి నారు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, కాయగూరలు, చిరు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత నిచ్చామన్నారు. దేశీయ దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక చేస్తామన్నారు. దేశీయ వరి విత్తనాలు విభిన్న రకాలు సేకరించి ఈ పది గ్రామాల్లో పండించి వాటిని అమ్ముకుని ఆదివాసీలు లబ్ది పొందేందుకు కృషి చేస్తామన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ దేశంలో చాలా రకాల దేశీయ విత్తనాలు అంతర్థానం అవుతున్నాయి అన్నారు. ఇటువంటి తరుణంలో వాటిని సంరక్షణ అవసరం అన్నారు. దానిని ద్రుష్టిలోనికి తీసుకుని లమ్మసింగి ప్రాంతంలో ని అసరాడ, భీముని పల్లి, రాజుబంద, చీకటి మామిడి, బంతి బయలు, వడగడ్డ, జల్లూరు మెట్ట, బురడ వీధి, రేమన్న పాకలు, నూతిబంద తదితర పది గ్రామాల్లో విత్తనాలు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతి రఘు, ఎంపిటిసి నాగమణి నూకరాజు తదితరుల చేతులు మీదుగా నారు పంపిణీ చేశారు…..