Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదేశీయ విత్తనాలతో గ్రామాల అభివృద్ధి

దేశీయ విత్తనాలతో గ్రామాల అభివృద్ధి

-

Chat on WhatsApp
  • ఆకుకూరలు, కాయగూరలు, చిరు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత
  • దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక
  • దేశీయ వరి విత్తనాలు సేకరణ
  • డాక్టర్ శశిప్రభ స్టేన్లీ, సిఇఒ, సిఫా

ప్రకృతి ఆధారంగా దేశీయ విత్తన గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని సిఫా సిఇఒ డాక్టర్ శశిప్రభ స్టేన్లీ పేర్కొన్నారు. చింతపల్లి మండలం లమ్మసింగి ప్రాంతంలో పది గ్రామాల్లో వెల్లంకి వంకాయ, బాపట్ల మిర్చి, నాటు టమాటా, బంతి నారు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, కాయగూరలు, చిరు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత నిచ్చామన్నారు. దేశీయ దుంప జాతి మొక్కల పునరుద్ధరణకు ప్రణాళిక చేస్తామన్నారు. దేశీయ వరి విత్తనాలు విభిన్న రకాలు సేకరించి ఈ పది గ్రామాల్లో పండించి వాటిని అమ్ముకుని ఆదివాసీలు లబ్ది పొందేందుకు కృషి చేస్తామన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ దేశంలో చాలా రకాల దేశీయ విత్తనాలు అంతర్థానం అవుతున్నాయి అన్నారు. ఇటువంటి తరుణంలో వాటిని సంరక్షణ అవసరం అన్నారు. దానిని ద్రుష్టిలోనికి తీసుకుని లమ్మసింగి ప్రాంతంలో ని అసరాడ, భీముని పల్లి, రాజుబంద, చీకటి మామిడి, బంతి బయలు, వడగడ్డ, జల్లూరు మెట్ట, బురడ వీధి, రేమన్న పాకలు, నూతిబంద తదితర పది గ్రామాల్లో విత్తనాలు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతి రఘు, ఎంపిటిసి నాగమణి నూకరాజు తదితరుల చేతులు మీదుగా నారు పంపిణీ చేశారు…..

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

akhil lenin movie us premiere first response

Lenin Movie Review | ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారు?

Lenin Movie Review: అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల అనంతరం సోషల్ మీడియాలో తొలి స్పందనలు వైరల్ అవుతున్నాయి. అఖిల్ కెరీర్‌లో...
- Advertisement -
Chat on WhatsApp