బడి దేవరకొండపై ప్రభుత్వం ఇచ్చిన అక్రమ గ్రానైట్ ప్లీజ్ లైసెన్స్ రద్దు చేయాలని ఐక్య పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం.
బడిదేవర కొండపై ఎం ఎస్ పి గ్రానైట్ లీజు లైసెన్స్ అక్రమం చట్టవిరుద్ధము పర్యావరణ వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వము లీజు లైసెన్స్ రద్దు చేయాలని 20-10-24 పార్వతీపురం సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లా
ఉపాధ్యక్షులు బంటు పాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కార్యాచరణ పోరాటం చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వము 2016 లో ఎం ఎస్ పి గ్రానైట్ కంపెనీకి బడిదేవరకొండ పై లైసెన్స్ ఇచ్చిందని. అది ఎలా
ఇచ్చారని ఆనాటి పర్యావరణ చట్టము విరుద్ధమని ఆయన అన్నారు.
ఇప్పటికైనా ప్రజా సంఘాలు ఏకము కాకపోతే బడిదేవరకొండ మిగలదని దానిమీద బతికిన గిరిజన ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.