డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబును కన్వీనర్ పదవి నుండి తప్పించాల్సిందేనని అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక తీర్మానాన్ని పంపారు. అంబాజీపేట మండలంలోని పలువురు నాయకులు తెలుగు మహిళలు నందంపూడి లో ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ టిడిపి కన్వీనర్ నామన్న రాంబాబు కార్యకర్తలకు ఏమాత్రం గుర్తింపునివ్వడం లేదని ఆయనతోపాటు డొక్క నాద్ బాబు కృష్ణరాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల అంబాజీపేట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుడాల ఫణి ని నా మన రాంబాబు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మండలంలో పార్టీ కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న వారిని ఇలా కించపరచడం సమంజసం కాదన్నారు. ఇప్పటికీ అయినవిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నామన రాంబాబు తీరుకు వ్యతిరేకంగా నామన రాంబాబును తొలగించాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం కష్టపడిన నియోజకవర్గానికి చెందిన నాయకులకు మాత్రమే కన్వీనర్ పదవి ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ ఉన్నారని తెలుగుదేశం పార్టీ తరఫున సరైన నాయకుడు లేకపోవడంతో తమ బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఆయా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన నామన రాంబాబు డొక్కా నాగబాబులకు మాత్రమే సమావేశంలో పెద్దపేట వేస్తున్నారని ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పి గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ గా నామన రాంబాబును తప్పించి పార్టీ కోసం కష్టపడే నాయకులకు అలాగే పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన నాయకులకు పార్టీ కన్వీనర్ పదవి ఇప్పించాలని వారు కోరారు.
నామన రాంబాబుకు కన్వీనర్ పదవి తొలగింపు డిమాండ్
