AP Weather Update: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని స్పష్టంచేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ వ్యవస్థ తుపానుగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత
ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గురువారం ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతాయని అంచనా.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
