ఏలూరు జిల్లా చింతలపూడి సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మద్యం పాలసీపై తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ మధ్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తుందని, మందు తక్కువ ధరకు అమ్మకం చేస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుచేసి గత ప్రభుత్వం లో ఉన్న నాసిరకం మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన నాణ్యమైన, సరసమైన, ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు వల్ల గ్రామాల్లో మద్యం జోరుగా విక్రయాలు చేస్తున్నారని దీని ద్వారా గ్రామాల్లో ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని బెల్ట్ షాపులు గ్రామాల్లో నివారించాలని కోరారు.
చింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం
