దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఈ లేఖ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన బాధ్యతగా పేర్కొంటూ, పౌరుల సహకారంతో దేశం మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి సారథ్యం వహించనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ, 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26వ తేదీని అధికారికంగా రాజ్యాంగ దినంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజ్యాంగ విలువలను ప్రజలకు చేరవేస్తున్నారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రజాస్వామ్య బలపాటుకు రాజ్యాంగ సూత్రాలు, పౌర హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచడం కీలకమని పునరుద్ఘాటిస్తున్నారు.
