సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గుండన్న పల్లిలో నిర్మాణంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, కార్యదర్శి నాయిని యాదగిరి. మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ మాట్లాడుతూ… గుండన్నపల్లి గ్రామస్తుల ఇలవేల్పు నల్ల పోచమ్మ దేవాలయం నిర్మాణానికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని, నల్ల పోచమ్మ దేవాలయం యధా స్థానంలో నిర్మించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గుడి నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు చేతి రెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్ గుప్తా, కొల్లూరి ఫణి ధర్, మాదగారి నరేష్, కుమార్, రంగయ్య, సాయిలు, కనకయ్య, పెద్ద ఎత్తున గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్ల పోచమ్మ ఆలయం నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతు
