నార్సింగ్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు సర్వేను పీసీసీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పథకం ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం కింద నార్సింగ్ మండలంలోని పలు గ్రామాల్లో సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సర్వే అనంతరం అర్హత కలిగిన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతోందని, ఆరు గ్యారెంటీలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని యాదగిరి యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పేదలకు అండగా నిలబడి, వారి కోసం మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సేవా దళ్ కార్యదర్శి యాదగిరి యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు అంచనూరి రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి, మరియు మరికొందరు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.