కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని అవమాన పరచారని ఐకెపి ఎపిఎం అశోక్ సిసి శంకర్లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి రావాల్సిందని అధికారులు ఆహ్వానించడంతో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి రావడం జరిగిందని కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని అధికారులు ప్రారంభోత్సవానికి రావద్దని సూచించడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ టి పి సి సి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ అన్నారు.
నర్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి అధికారులు ఆహ్వానం పంపించడంతో కాంగ్రెస్ నాయకులు అట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన నాయకులను పిలువకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టిపిసిసి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులను ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలిచి వారి చేతుల మీదుగా ప్రారంభించే వారిని, ప్రస్తుతం నార్సింగ్ మండలంలో ఉన్న ఐకెపి అధికారులు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులను పిలిచి అవమానించడం బాధాకరమని, అవమానానికి గురిచేసిన ఐకెపి సిసి శంకర్, ఎపిఎం అశోక్ లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులే వద్దన్నట్లు వారు చెప్పారని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు రావద్దని మండల అధికారులకు సూచించిన జిల్లా అధికారులు ఎందుకు రావద్దు అనే విషయం మాకు తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ రాహుల్ రాజ్ కూ ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టిపిసిసి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఎస్టీ సేల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, పెద్దతండ నాయకుడు రాము నాయక్,చిగురుపల్లి ప్రభాకర్, దొంతి స్వామి తదితరులు పాల్గొన్నారు.