Kurnool: కర్నూలు జిల్లా కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’(Mee Bhoomi Mee Hakku) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి హక్కులపై కీలక హెచ్చరిక చేసారు. ఆయన మాట్లాడుతూ, “మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులు మీకు మంజూరు చేశాం. గతంలో భూ సంబంధ సమస్యలు చాలా చికాకులు ఇచ్చాయి.
ఇప్పుడు ఎవరైనా మీ భూమిని తమ పేరులోకి మారుస్తే వెంటనే గుర్తించబడుతుంది. QR కోడ్ సౌకర్యం ద్వారా మీరు మీ ఫోన్లోనే వివరాలను చూడవచ్చు. అన్ని రికార్డులు సురక్షితంగా కంప్యూటర్లో భద్రంగా ఉన్నాయి. భూమి ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తాం, వదిలిపెట్టే అవకాశమ లేదు.”
చంద్రబాబు స్పష్టంగా ట్యాంపరింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని ప్రజలకు వివరించారు. ఈ నిర్ణయం రైతులు, భూమి యజమానులకు భరోసా ఇస్తుంది, డిజిటల్ భూమి రికార్డులు అన్ని సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భూమి లావాదేవీలలో పారదర్శకత, భద్రత కల్పిస్తున్నాం అని తెలిపారు.
ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే | Chandrababu Warns Land Tampering
Chandrababu Warns Land Tampering
