ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా విజయనగరం జిల్లాలో పర్యటన ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ పర్యటన రద్దయింది. అనకాపల్లి జిల్లాలో పర్యటనకు మార్పు చేసి, రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో చంద్రబాబు రోడ్డు రోలర్ నడుపుతూ రహదారి పనుల్లో సహకరించడం విశేషం. రోడ్డు రోలర్‌పై స్వయంగా కొద్దిదూరం నడిపిన చంద్రబాబు తనదైన శైలిలో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత కూడా ఆయన వెంట ఉన్నారు.
నిన్న శ్రీకాకుళం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి, స్వయంగా టీ తయారుచేసిన చంద్రబాబు, ఇవాళ రోడ్డు రోలర్ డ్రైవర్ అవతారమెత్తారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ప్రజల్లో విశేషంగా ఆకర్షణను కలిగిస్తున్నాయి.