సగరుల అభ్యున్నతి కోసం పిఎసి చైర్మన్ గాంధీ మాటలు

Chairman Harikepudi Gandhi emphasized his commitment to the welfare of all castes and communities. He inaugurated the Sagar Sangham community hall and promised support for women's empowerment and development. Chairman Harikepudi Gandhi emphasized his commitment to the welfare of all castes and communities. He inaugurated the Sagar Sangham community hall and promised support for women's empowerment and development.

అన్ని కులాల అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, నిబద్దత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని పిఎసి చైర్మన్ శేర్లింగంపల్లి శాసనసభ్యులు హరికెపూడి గాంధీ పేర్కొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో గల సగర సంగం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ రోజా దేవి రంగారావుతో కలిసి పిఎసి చైర్మన్, శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార ప్రభుత్వం అన్ని వర్గాల అన్ని కులాల శ్రేయస్సు కోసం పాటుపడుతోందని చెప్పారు. ప్రధానంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సగర కులస్తులతో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పాటు నిబద్దతతో సగర కులస్తులు వ్యవహరిస్తూ ఉంటారన్నారు.

మిగతా కుల సంఘాలకు సగర సంఘ వారు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నిరంతరం తాను నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని అందులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నానని చెప్పారు. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టి శేర్లింగంపల్లి నియోజకవర్గం ముఖచిత్రాన్ని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మార్చి వేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సగర మహిళా సంఘం వారు మహిళకు టు శిక్షణ కేంద్రానికి కుట్టు మిషన్లు ఇవ్వవలసిందిగా అభ్యర్థించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

అలాగే సగర మహిళ భవనం నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని అరికెపూడి గాంధీ హామీ ఇచ్చారు. జగద్గిరిగుట్ట సగర సంగం ప్రధాన కార్యదర్శి ఆస్కానీ శ్రీనివాస్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు, జగద్గిరిగుట్ట సగర సంగం అధ్యక్షులు ఆస్కానీ కొండయ్య సాగర్, కోశాధికారి కొమ్ముల రాజేష్ సాగర్, సాగర సంగం రాష్ట్ర నాయకులు కే పి రామ్ సాగర్, కె.పి రాములు సాగర్, ఎం రాములు సాగర్, జి సత్యనారాయణ సాగర్ మరియు గౌరవ సలహాదారులు, సగర మహిళా సంఘం అధ్యక్షురాలు జి కుసుమసాగర్, కోశాధికారి సిహెచ్ జ్యోతి సాగర్, వార్డు కమిటీ సభ్యులు చంద్రమోహన్ సాగర్, యువజన సంఘం అధ్యక్షులు ఎం మురళి సాగర్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ శేఖర్ సాగర్, కోశాధికారి సంపత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *