తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి బీసీ కమ్యూనిటీకి 42% రిజర్వేషన్‌ను కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం సంబరాలు రేపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పాలాభిషేకం అనంతరం పటాకులు కాల్చి, స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి తన వంతు కృషి చేసినందుకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పరిగి ప్రాంతంలోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి నాగులపల్లి రామకృష్ణ, నసీమోముద్దీన్, మార్కెట్ చైర్మన్ బి. పరశురాం రెడ్డి, బాబయ్య, పరిగి మండల ఉపాధ్యక్షులు ఆనందం, గనేమోని శ్రీనివాస్, కుడుముల యాదయ్య, జి. సత్తయ్య, టీ. వెంకటేష్, నందు, మల్లేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ, రేవంత్ రెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.