రామగుండం పట్టణ ఆత్మీయ సోదరి,సోదరులకు కార్మికుల,కర్షకులకు ప్రజలకు నా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ…బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరుకంటి చందర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయదశమి పండుగ పురస్కరించుకొని సాంప్రదాయానికి, సంస్కృతి చిహ్నమైన జమ్మి చెట్టు ఆకు.. జమ్మి ఆకు లేనిదే దసరా ఉత్సవం కనిపించదు అలాంటి జమ్మి ఆకు పవిత్రమైనది ప్రత్యేకమైనది… అలాంటి జమ్మి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది కావున రామగుండం మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ అన్నగారు పిలుపుమేరకు ఈరోజు రామగుండం పట్టణం లోని నాలుగు డివిజన్లలో రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ గారి సూచన మేరకు .. 21 వ డివిజన్ విద్యుత్ నగర్ లోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ యూత్ ఆధ్వర్యంలో బొడ్డుపల్లి శ్రీనివాస్, అతారుద్దీన్, నిమ్మిని సంతోష్, గుండ్ల సంతోష్ దామోదర్ రెడ్డి,నడెం నరేందర్ చేతుల మీదుగా అయ్యగారు శ్రావణ్ గారి మంత్రోచ్ఛాలతో జమ్మి మొక్కను పెట్టడం జరిగింది.. 20వ డివిజన్ లో బీసీ కాలనీలో నాయకులు శివరాత్రి గంగాధర్ గారి చేతుల మీదుగా జమ్మి మొక్కను పెట్టడం జరిగింది.. 22వలో డివిజన్ అధ్యక్షులు మాడిశెట్టి రవి గారి ఆధ్వర్యంలో బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండి అతారుద్దీన్, సబ్బు శంకర్ గార్ల చేతుల మీదుగా జమ్మి మొక్కన పోచమ్మ గుడి ఆవరణలో పెట్టడం జరిగింది.. ఇలాగే 22వ డివిజన్ సీనియర్ సిటిజన్ పార్కులో రామసేన యూత్ ఆధ్వర్యంలో బొడ్డుపల్లి శ్రీనివాస్, రామసేన యూత్ చేతుల మీదుగా జమ్మి మొక్కలను పెట్టడం జరిగింది..
జమ్మి చెట్టు మొక్కలు నాటిన విజయదశమి వేడుకలు
