ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చర్చల అనంతరం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సమాఖ్య ప్రతినిధులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్‌ విరమణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యపై ప్రభుత్వం, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్‌లో నాలుగు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం కుదిరింది. ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బంద్‌ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చలలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.600 కోట్లు విడుదల చేసినట్లు, మరో రూ.600…

Read More
pm modi wishes to cm revanth reddy

రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సందేశం పోస్టు చేశారు. మోదీ సందేశం తర్వాత పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి…

Read More
శాతవాహన విశ్వవిద్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో స్నాతకోత్సవ వేడుక

శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ

కరీంనగర్‌:శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా రెండో స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ “జిష్ణుదేవ్‌ వర్మ” ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను అభినందించారు. ఆయనతోపాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ “బీజే రావు”కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు “161 గోల్డ్‌ మెడల్స్‌”, “20 పైగా డాక్టరేట్‌ పట్టాలు” అందజేశారు. గవర్నర్‌ విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఉన్నత విద్యను సమాజ సేవకు ఉపయోగించాలన్నారు. ALSO…

Read More
హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్ – రూ.107 కోట్ల రికవరీ

సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసుల బిగ్‌ బ్రేక్‌ – రూ.107 కోట్ల రికవరీ

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసులు బిగ్‌ బ్రేక్‌ అందించారు.సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి భారీ విజయం సాధించారు. పెట్టుబడులు, ఫోన్‌ కాల్స్‌, ఫేక్‌ యాప్‌లు, మెసేజ్‌ లింకుల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌ నెలలో సైబర్‌ మోసాలకు సంబంధించిన 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 55…

Read More
మాజీ మంత్రి హరీశ్ రావు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే నరకయాతన – హరీశ్ రావు విమర్శలు

HYD:జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు వచ్చే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని మాజీ మంత్రి “హరీశ్ రావు” తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది వికాసం కోసం జరగుతున్న ఎన్నిక కాదు, విధ్వంసం కోసం జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఏది కావాలో ఇప్పుడు తేల్చుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు.హరీశ్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. నాలుగు కోట్ల ప్రజలు కాదు, నలుగురు బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారు. గ్యారంటీలు…

Read More
వరంగల్‌లో వందేమాతర గీతంతో ప్రారంభమైన వివాహ వేడుక

వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక

వరంగల్: జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకలోనూ దేశభక్తి ప్రతిధ్వనించింది. వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్‌ గోగికార్‌ శ్రీకాంత్‌, లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుకలో భాగంగా ‘వందేమాతరం’ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పెళ్లి మండపంలోనే సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వధూవరులు, బంధుమిత్రులు, అతిథులు అందరూ కలసి దేశభక్తితో గళం…

Read More
ఆర్టీసీ డ్రైవర్‌ సిమ్యులేటర్‌ శిక్షణలో పాల్గొంటున్న దృశ్యం

ప్రమాదాల నివారణకు ఆర్టీసీ కొత్త చర్యలు – డ్రైవర్లకు సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం

HYD: చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకమవుతుందనే చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరోసారి నిరూపించింది. టిప్పర్‌ డ్రైవర్‌ తప్పిదం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో, డ్రైవింగ్‌ భద్రతపై ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇకనుంచి డ్రైవర్ల సామర్థ్యాన్ని పెంపొందించి ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టీసీ ఆధునిక సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించనుంది.  ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రెండు అధునాతన సిమ్యులేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు చివరి వారంలోగా వరంగల్‌,…

Read More