తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములు, గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో అశాంతి.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. కొమురంభీమ్…

Read More
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు చేస్తోంది. రవాణా తీవ్రంగా నష్టపోయింది.

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల ప్రభావం రైళ్ల రద్దుతో రవాణా సమస్య

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలోనూ పలు రైళ్లను రద్దు చేశారు.  తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు…

Read More
భారీ వరదల సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు బాలకృష్ణ, ఎన్టీఆర్, సిద్ధు, విశ్వక్సేన్ విరాళాలు ప్రకటించి, బాధితులకు సాయంగా నిలిచారు.

వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు సెలబ్రిటీల సాయ హస్తం

భారీ వరదల కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని చెప్పారు. రెండు…

Read More
ఉపాసన, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో మహిళలకు హెల్త్ కేర్ రంగంలో వ్యాపార సాయం అందించనున్నట్టు తెలిపారు. కో-ఫౌండర్‌గా సహాయం చేయడానికి యువ మహిళలు ముందుకు రావాలని పిలుపు.

మహిళలకు వ్యాపార సాయం అందిస్తానని అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన ప్రకటించారు

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని హీరో రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు. భారతదేశంలో హెల్త్…

Read More
అమీన్ పూర్ మండలంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. నిర్మాణాలు కూల్చి, సరిహద్దు రాళ్లను తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 15 గుంటలు కూడా కూల్చివేశారు.

అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు…

Read More
తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌజ్ లోకి వరద నీరు చేరింది. రూ. 10 కోట్లు నష్టం, అంచనా వేయడం కొనసాగుతోంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద నష్టం

తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌజ్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌజ్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర…

Read More
ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ప్రతి రాష్ట్రానికి రూ. 50 లక్షలు.

ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. జన‌జీవనం అస్త‌వ్య‌స్తంగా మారింది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌ముఖులు వ‌ర‌ద బాధితుల‌కు త‌మవంతు సాయం చేందుకు ముందుకు వ‌స్తున్నారు.  మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’…

Read More