
మెదక్ జాతీయ రహదారిపై 16 సీసీ కెమెరాల ఏర్పాటు
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి టి జంక్షన్ జాతీయ రహదారిపై భద్రతను పెంచేందుకు 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నేరాల అదుపు కోసం సీసీ కెమెరాలు ఎంతో కీలకమని ఎస్పీ అన్నారు. సీసీ కెమెరాలు చోరీలు, నేరాలు జరిగినప్పుడు నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగపడతాయని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరించారు….