
గురుకులలో దొడ్డు బియ్యం.. మంత్రికి విద్యార్థుల ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా చింతకుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యతపై తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా, విద్యార్థులు గత 15 రోజులుగా తాము దొడ్డు బియ్యంతో భోజనం చేస్తున్నామని ఫిర్యాదు చేశారు. ఈ విషయం వినగానే మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత చాలా దారుణంగా ఉందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలకు…