Professional swimmers rescuing a man who jumped into the Krishna River at Beechupally

బీచుపల్లి కృష్ణానదిలో దూకిన వ్యక్తిని రక్షించిన గజ ఈతగాళ్లు

జోగులాంబ గద్వాల జిల్లా ఎడవల్లి మండలం బీచుపల్లి కృష్ణానదిలో జరిగిన ఆత్మ*హ*త్య ప్రయత్నం సకాలంలో తప్పింది. కర్నూలుకు చెందిన సూర్య అయ్యప్ప స్వామి, కృష్ణా బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకగా, అక్కడే విధి నిర్వహణలో ఉన్న గజ ఈతగాళ్లు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే చర్యలకు దిగారు. బోటు సహాయంతో వేగంగా చేరుకున్న వారు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలను రక్షించారు. ALSO READ:India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర…

Read More
కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి మృతి

కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం

గద్వాల జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి ఉన్న కారు దుర్ఘటనకు గురైంది. కొత్తకోట సమీపంలో కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఢీ అంత భయంకరంగా ఉండడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి…

Read More
Protest rally held in Gadwal against the Waqf Bill; leaders and public demand immediate withdrawal of anti-minority amendment.

వక్ఫ్ బిల్లుపై గద్వాలలో ముస్లింల నిరసన ర్యాలీ

గద్వాల్ పట్టణంలో వక్ఫ్‌ బోర్డు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ముస్లిం సమాజం ఉమ్మడి ఆందోళన చేపట్టింది. ధరూర్‌మెట్‌లోని ప్రముఖ దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఈ నిరసనకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ సహా…

Read More
BRS Youth Meet Shines in Nadigadda with Massive Support

నడిగడ్డలో బీఆర్ఎస్ యువ సభ కాంతివంతం

జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నడిగడ్డలో జరిగిన సన్నాహక సమావేశం ఉత్సాహంగా సాగింది. యువజన నాయకుడు రామకృష్ణ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆంజనేయ గౌడ్ చురుకైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలో జీరో సర్కార్, కేంద్రంలో నీరో సర్కార్” అని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ నవతరం నెత్తురు తాగుతోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ స్పూర్తితో, చల్లా ప్రోత్సాహంతో తాము నడిగడ్డలో పాదయాత్ర చేపట్టనున్నట్లు…

Read More
MLA Bandla Krishnamohan Reddy and Collector Santosh paid rich tributes to Mahatma Jyotirao Phule on his 198th Jayanti in Gadwal.

గద్వాలలో మహాత్మా పూలే జయంతి వేడుకల సందడి

గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణ వేణి చౌక్‌ వద్ద శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ కలిసి మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా పూలే బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. అణచివేతలో ఉన్నవారికి అద్దం పట్టిన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ఆయన…

Read More
A new police station is being constructed in Jogulamba Gadwal’s Dharoormandal with a ₹2.65 crore budget.

జోగులాంబ గద్వాల‌లో కొత్త పోలీస్ స్టేషన్ భూమిపూజ

జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేందర్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రజలకు మెరుగైన భద్రతను అందించేందుకు ఆధునిక పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి రూ. 265 లక్షల రూపాయలు కేటాయించారని జితేందర్ వెల్లడించారు. మండల…

Read More
Former MLA Sampath Kumar initiates new CC road works for rural development in Alampur constituency.

అలంపూర్‌లో నూతన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

అలంపూర్ నియోజకవర్గంలోని ఉట్కూరు, ఉండవల్లి, మార మునగాల, ఎర్రవల్లి, ధర్మవరం, మునగాల గ్రామాల్లో నూతన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఏస్.ఏ. సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలలో 30 కోట్లకు పైగా నిధులు అలంపూర్ నియోజకవర్గానికి మంజూరయ్యాయని నేతలు తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, నీటి వసతులు, గ్రామీణ సౌకర్యాలను…

Read More