అలంపూర్ నియోజకవర్గంలోని ఉట్కూరు, ఉండవల్లి, మార మునగాల, ఎర్రవల్లి, ధర్మవరం, మునగాల గ్రామాల్లో నూతన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఏస్.ఏ. సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలలో 30 కోట్లకు పైగా నిధులు అలంపూర్ నియోజకవర్గానికి మంజూరయ్యాయని నేతలు తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, నీటి వసతులు, గ్రామీణ సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఇన్‌ఛార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకరించారని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోడ్డప్ప, వైస్ ఛైర్మన్ కుమార్, గ్రంథాలయ ఛైర్మన్ నీలి శ్రీనివాస్, తెలంగాణ టెలికాం బోర్డు మెంబర్ ఇస్మాయిల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కొంకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు రోడ్డు పనులు ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రుక్మానంద రెడ్డి, సతర్ల జయ చంద్రారెడ్డి, మండల నాయకులు ఉండవల్లి గోపాల్, రాము, దేవేంద్ర శ్రీను, నర్సన్ గౌడ్, జగన్ మోహన్ నాయుడు, మైనర్ బాబు, వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.