కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారంఫై సుప్రీం ఆగ్రహం

కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటుచేసుకోగా మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తయిందని గుర్తుచేస్తూ.. ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45…

Read More

అర్షద్ వార్సీపై సుధీర్ బాబు కౌంటర్: ప్రభాస్ స్థాయి గొప్పది

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ను ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ తీవ్ర వాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ‘క‌ల్కి 2898 ఏడీ’ చిత్రంలో డార్లింగ్ గెట‌ప్ జోక‌ర్ ను త‌ల‌పించింద‌ని వార్సీ అన్నారు. మ‌రోవైపు అశ్వ‌త్థామ పాత్ర‌లో న‌టించిన బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారాయ‌న‌. అస‌లు మేక‌ర్స్ ప్ర‌భాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో త‌న‌కు అర్థం కావ‌ట్లేద‌ని చెప్పుకొచ్చారు.  దీంతో అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌కు టాలీవుడ్ న‌టీన‌టులు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా హీరో…

Read More

వైద్యుల రక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీం

దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు మంగళవారం ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో దారుణం జరిగేంత వరకూ దేశం వేచి ఉండలేదని, డాక్టర్ల రక్షణకు సంబంధించి మరిన్ని ఏర్పాట్లు అవసరమని పేర్కొంది. అదేవిధంగా…

Read More

హైదరాబాద్ లో కుండపోత వర్షం. పలు ప్రాంతాలు జలమయం, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు…

Read More

గ్రామ సభలకు డిప్యూటి సీఎం పవన్ హాజరు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా  ఈ నెల 23వ తేదీన గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకే రోజున 13326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రామ సభల నిర్వహణపై జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలతో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. కాగా, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్…

Read More