
Inter National News


చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ – ఎస్‌సీఓ సమ్మిట్‌లో మోదీ హాజరు ధృవీకరణ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మంగళవారం న్యూఢిల్లీలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఇది మోదీ పాల్గొనబోతున్నారన్న మొదటి అధికారిక ధ్రువీకరణగా నిలిచింది. అజిత్ డోభాల్ మాట్లాడుతూ, “భారత్–చైనా సంబంధాల్లో కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి…

పుతిన్‌తో మోదీ కీలక చర్చలు – ట్రంప్ భేటీ వివరాలపై ఫోన్ సంభాషణ
అలస్కాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ సంభాషణలో పుతిన్, ట్రంప్‌తో తాను జరిపిన చర్చల విషయాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన సమయంలో తొలిసారి ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఇలాంటి చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి ఉక్రెయిన్ సమస్య, అంతర్జాతీయ సంబంధాలు,…

ట్రంప్ ఆరోపణల వెనుక నిజం ఏంటి? ‘టారిఫ్ కింగ్’ వివరణ!
‘‘భారత్ టారిఫ్ కింగ్’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆరోపించారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఏంటి? నిజంగానే భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధిస్తున్నదా? ఈ వీడియోలో ట్రంప్ ఆరోపణలకు గణాంకాలతో సమాధానం చెబుతున్నాం. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత్ సాధారణ సగటు సుంకం 15.98% అయినప్పటికీ, వాణిజ్య ఆధారిత సగటు సుంకం కేవలం 4.6% మాత్రమే. అంటే భారత్ చాలా తక్కువ సుంకాలను మాత్రమే వసూలు చేస్తోంది….

భారత్‌పై ట్రంప్ సుంకాల తూటాలు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విఫలత వెనుక ఆగ్రహమేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా భారత్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన మరోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తీసుకుంటున్న ఆర్థిక విధానాల్లో భారత్‌కు గట్టి దెబ్బలే కనిపిస్తున్నాయి. 25 శాతం అదనపు దిగుమతి సుంకాలను విధించడమే కాకుండా, రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై పెనాల్టీలు విధించబోతున్నట్టు హెచ్చరించారు. ఇప్పటివరకు భారత్‌తో స్నేహపూర్వకంగా వ్యవహరించిన ట్రంప్‌కు అకస్మాత్తుగా ఈ కోపం రావడానికి అనేక రాజకీయ, భౌగోళిక కారణాలు ఉన్నట్లు నిపుణులు…

శిబు సోరెన్‌కు ప్రధాని మోదీ నివాళి, హేమంత్‌ను ఓదార్చిన దృశ్యం
జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు. ఈ దృశ్యాలను మోదీ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పంచుకున్నారు. దేశ రాజకీయాల్లో శిబు సోరెన్ సుదీర్ఘ ప్రస్థానానికి నివాళిగా పలువురు…

ఇరాన్–పాక్ పొత్తు వెనుక అసలైన వ్యూహం ఇదే?
ఇరాన్–పాకిస్థాన్ మధ్య కొత్త ఒప్పందాలు: మధ్యప్రాచ్యంలో శాంతికి ఇది మార్గమా లేదా ముప్పా? ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన తాత్కాలిక యుద్ధ సమయంలో ప్రపంచం గమనం మళ్లిన మరో కీలక అంశం – ఇరాన్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న మైత్రి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పాక్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు తాజా అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌కు అణు హక్కు ఉందా?…