ఆదిలాబాద్ స్కూల్‌లో నీటికి విషం కలిపిన దుండగులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగ ఘటన కలకలం రేపుతోంది. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్ వంట గదిలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారని అధికారులు గుర్తించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే వంట పాత్రలతోపాటు ఆహార పదార్థాల పైనా విషం చల్లినట్టు సమాచారం. శనివారం, ఆదివారం సెలవుల సందర్భంగా వంట సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వచ్చి వంట…
