పండగ సీజన్‌లో బంగారం–వెండి ధరలు ఆకాశమే హద్దు!
ఈ పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎగసిపడుతున్నాయి. విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుండటంతో, వినియోగదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి. మేలిమి బంగారం (99.9% స్వచ్ఛత) ధర సోమవారం ఏకంగా రూ.2,700 పెరిగి తులానికి రూ.1,23,300కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర…
